ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అల్లిపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో పత్రిక ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) జిల్లా కార్యదర్శి ఉల్లం.నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే విద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా అడుగులు వేస్తుందని దానికి నిదర్శనమే 10 వైద్య కళాశాలలను పి.పి.పి పేరుతో ప్రైవేటీకరణ చేస్తుందని తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ మేము అధికారంలోకి రాగానే 107,108 రద్దుచేసి వైద్య కళాశాలలలో 100% కన్వీనర్ కోటాలో అడ్మిషన్స్ చేస్తామన్నారు