నిజామాబాద్ నగరంలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ గౌడ్ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీమతి డాక్టర్ రమాదేవి హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని ప్రభుత్వంనకు డిమాండు చేశారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్లో ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తలపెట్టిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుదించాలని ధర్నాకు మద్దతు తెలుపుచున్నామని తెలియజేశారు.