ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. గోనెగండ్ల జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో ఎడ్ల బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను బండలాగుడు పోటీల నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీశ్రీ చింతలాముని నల్లారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద పండ్ల వ్యాపారం చేసే సుభద్రమ్మ గారికి స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి జ్ఞాపకార్థం "తోపుడు బండిని" బహుకరించారు.