మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎస్బిఐ బ్యాంక్ మోసం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఉదయం బ్యాంక్ ఎదుట గోల్డ్ లోన్ ఖాతాదారులు మరొకసారి ఆందోళన చేపట్టారు. బ్యాంక్ ఎదుట బైఠాయించి ఎస్బిఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, తమ బంగారం తమకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.