రక్తదానం ప్రాముఖ్యతను, ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో నిర్వహించిన 7రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకుని తణుకు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల పట్ల ఆయన పార్టీ నాయకులను అభినందించారు తణుకు పట్టణంలోని ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి క్రాస్ సొసైటీను గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.