పెన్షన్ లు పెంచే అంతవరకు పోరాటం ఆపేది లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల సన్నాహక సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంచాలని వృద్దులు ,వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు మొత్తం చేయూత పెన్షన్లన్నీ నాలుగువేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . అధికారంలోకి వచ్చిన వెంటనే చేయూత పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన సి ఎం రేవంత్ రెడ్డి పెన్షన్ దారులను దారుణంగా మోస