ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11వ తేదీన బాపట్ల మండలం నగరవనంలో అటవీ అమరవీరుల దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని కలెక్టర్ వెంకటమురళి తెలిపారు.పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు మంగళవారం నగరవనాన్ని సందర్శించి అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.ఇదే చోట అమరవీరుల స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ కు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పి డూడీ చెప్పారు.