అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో పట్టపగలే ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు వైయస్సార్ కాలనీలో రమేష్ నాయక్ అంగడి రూము బాడుగకు తీసుకొని చిల్లర కొట్టు నడుపుతున్నాడు. బుధవారం రమేష్ నాయక్ చిల్లర కొట్టు తెరిచే క్రమంలో అంగడి యజమాని సమీప బంధువులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. రమేష్ నాయక్ కేకలు వేయడంతో వెంటనే గమనించిన స్థానికులు రమేష్ నాయక్ ను జిల్లా ఆసుపత్రికి చికిత్సలు అందించారు. రమేష్ నాయక్ పరిస్థితి విషమించడంతో వైద్యుల సిఫార్సు మేరకు మెరుగైన వేద్యం కోసం పెద్ద ఆసుపత్రికి తరలించారు.