రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని సమస్యల పరిష్కారం కోరుతూ రూరల్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు శనివారం వినతి పత్రం అందించారు. సమస్యలు సత్వరం పరిష్కరించకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని రూరల్ అధ్యక్షుడు పరమేష్ అన్నారు. గతంలో నిర్మించిన చెక్ డ్యాముల నాణ్యత సరిగా లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు.