Kandukur, Sri Potti Sriramulu Nellore | Aug 24, 2025
రాష్ట్రంలో సంచలనం రేపిన కరేడు రైతు ఉద్యమం ఆసక్తికర మలుపు తిరిగింది. ఉలవపాడు (m) కరేడులో ఇండోసోల్ పరిశ్రమ కోసం ఇచ్చిన 4,800 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరుతూ పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కరేడు, ఉలవపాడు, కందుకూరు తదితర ప్రాంతాలలోని 10 దేవాలయాలకు చెందిన 104.21 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్లో చేర్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.