అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్రాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో వినాయక నిమజ్జన సమయంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ప్రధానంగా వినాయక నిమజ్జనంలో గ్రామానికి చెందిన హరీష్ పి ఎస్ ఐ కళ్యాణ్ చొక్కా పట్టుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుందని వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి సీఐ పుల్లయ్య వివరణ అందించారు.