అశ్వారావుపేట నియోజకవర్గంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి దమ్మపేట అతలాకుతలం అయ్యింది. లోతట్టు ప్రాంతాలలోని నివాసాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపై వరద నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వ్యాపార సముదాయాల్లోకి సైతం వరద నీరు చేరింది. ప్రభుత్వ పశువైద్యశాలను వరద నీరు పూర్తిగా ముంచెత్తింది.మరోవైపు మల్లెపూల వాగు ఉదృతంగా ప్రవహిస్తూ పామాయిల్ తోటలను ముంచెత్తడంతో పామాయిల్ తోటలు నీటమునిగాయి.