కడప జిల్లాలో విద్యా రంగం, మౌలిక సదుపాయాలు మరియు పారిశ్రామిక అభివృద్ధి కోసం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారు గౌరవ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారికి లేఖలు సమర్పించారు.ఈ సందర్భంగా వారు కడప నియోజకవర్గంలోని పాఠశాలలకు మౌలిక వసతుల కోసం SSA నిధుల మంజూరు,ఉర్దూ మీడియం ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల సరఫరా, కడప ఐటీ పార్క్ అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు వంటి అంశాలను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు.