విత్తన గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హరితసేన ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తో పాటు రాచకొండ సిపి అక్షాంశ్ యాదవ్, యాదగిరిగుట్ట ఏసిపి శ్రీనివాస్ నాయుడు, సిఐ భాస్కరరావు, మున్సిపల్ కమిషనర్ వీరాస్వామి, భువనగిరి సీఐ రమేష్ లకు విత్తనగనపత్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ విత్తన గణపతులను పూజించాలని కోరారు. ప్లాస్టాప్ ప్యారిస్ ద్వారా నిర్మించిన గణపతుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిపారు.