గుంటూరులోని ఆర్. అగ్రహారానికి చెందిన బేతంశెట్టి అశోక్ కనిపించకుండా పోయాడు. తన కుమారుడు కనిపించడం లేదని బాలుడి తల్లి వెంకటలక్ష్మి లాలాపేట పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసింది. బందులు వద్ద ప్రాంతాల్లో పరిశీలించిన బాలుడు ఆచూకీ తెలియకపోవడంతో పిటిఆర్ చేసినట్లుగా వెంకటలక్ష్మి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షేక్ హషీమ్ తెలిపారు.