కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హైకోర్టు కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో DSC 2003 పాత పెన్షన్ పోరాట సమితి జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్సీ 2003 పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో CPS అమలు తేదీ 2004 నవంబర్ 1వ తేదీకి ముందు న్యామకమైన వారికి, కొత్త పెన్షన్ విధానం అమలు పరిచారన్నారు