సిద్దిపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వద్ద శనివారం యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఉదయం నుంచి వేచి ఉన్న తమకు యూరియా దొరకలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు ఈ మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న సిద్దిపేట టూ టౌన్ పోలీసులు రైతులతో మాట్లాడి ధర్నా విరమింప చేశారు. కొద్దిసేపు రోడ్డుపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున వాహనాలు రోడ్డుపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది చివరకు పోలీసులు రైతుల చేత ధర్నా విరమింప చేశారు