లింగంపేట : సీఎం. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, తీవ్ర వర్షాల వల్ల పంట పొలాల్లో ఇసుకమేటలతో నష్టపోయిన లింగంపేట్ మండలంలోని బురిగిద్ద తండాలో ముగ్గురు రైతులైన సబవత్ రవీందర్, దేగవతలక్ష్మి, కోడూరి ఆంటోనీల పొలాల్లో చేరిన ఇసుకమేటలను తొలగించే పనులు శుక్రవారం నుండి ఉపాధి హామీ పథకం కింద భూమి అభివృద్ధి పనులలో భాగంగా ప్రారంభమయ్యాయి. ఈ పనులను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. సురేందర్ సందర్శించి పరిశీలించారు. రైతుల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపేట ఎంపీడీవో నరేష్, ఏపీవో నరేందర్, ఈసీ రాజా, ఎఫ్ ఎ తదితరులు పాల్గొనడం జరిగిందన్నారు.