కామారెడ్డి: తెలంగాణలోనే కామారెడ్డిలో ఉన్న ఏకైక డెయిరీ కళాశాలలో బీటెక్తో పాటు ఎంటెక్ కోర్సు అమలయ్యేలా ఢిల్లీకి వెళ్లి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి అన్నారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తూ కామారెడ్డి పట్టణంలోని డెయిరీ కళాశాల, పాత రాజంపేట శివారులో ఉన్న విజయ డెయిరీని ఆకస్మిక తనిఖీ చేశారు. డెయిరీ సరిహద్దులు గుర్తించాల్సిన అవసరం ఉందని వెంటనే కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయ డెయిరీ శిథిలావస్థలో ఉందని ఛైర్మన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా డెయిరీని త్వరలోనే ఆధునీకరిస్తామన్నారు.