అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల ఆవరణలో హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బి మోహన్ నాయక్ విద్యార్థులతో కలిసి జిల్లాలో ఆర్డిటి సమస్త సేవలను పునరుద్ధరించాలని అంశంపై సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లాలో పేదలు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న ఆర్డిటి సేవలను యధావిధిగా కొనసాగించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదల జీవితాలను మార్చి వెలుగులు నింపిన ఆర్డిటి సంస్థను ప్రభుత్వం రక్షించి కాపాడాలని డిమాండ్ చేశారు.