Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 6, 2025
కందుకూరు సబ్ కలెక్టరేట్ లో శనివారం జరిగిన గిరిజనుల గ్రీవెన్స్ డే కార్యక్రమంలో కూడా కరేడు భూసేకరణపై నిరసనలు ప్రతిధ్వనించాయి. కరేడులోని రామకృష్ణాపురం గిరిజన కాలనీని ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయమని స్పష్టం చేశారు. 30 పోలీస్ యాక్ట్ నిర్బంధాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇండోసోల్ కోసం మా జీవనాన్ని దెబ్బ తీయవద్దు.. మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయండి.. మా జోలికి రావద్దంటూ వేడుకున్నారు. ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.