స్వాతంత్య్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తి ప్రదాత అని, భవిష్యత్ తరాలకు ఆదర్శ ప్రాయులని నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ మీటింగ్ హాల్ నందు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి...మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతోందని అన్నారు.