అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 1:30 సమయంలో పరిసరాల పరిశుభ్రత పారిశుద్ధ్య కార్యక్రమం పై స్థానిక ఎంపీడీవో బివి రవి ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీ కార్యక్రమంలో ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి భత్తుల కోదండరామిరెడ్డి, ఈఓఆర్డి సతీష్ కుమార్, గ్రామ సర్పంచ్ మీనుగ లలితమ్మ, ఉరవకొండ ప్రభుత్వాసుపత్రి పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినీత హెల్త్ అసిస్టెంట్లు రాఘవేంద్ర మమతా జయలక్ష్మి తదితరులు ర్యాలీలో పాల్గొని మానవహారం ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులు పరిసరాలు పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.