నందవరం: మన గ్రోమోర్ సెంటర్లో అధికారుల తనిఖీలు..నందవరంలో మన గ్రోమోర్ సెంటర్ను బుధవారం తహశీల్దార్ శ్రీనివాసులు, మండల వ్యవసాయ అధికారి సరిత, తనిఖిలు చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, యూరియ ఎంత ఉందో వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నందవరంకు 12.6 మెట్రిక్ టన్నులు యూరియా వచ్చిందని, మన గ్రోమోర్ సెంటర్లో యూరియ నిల్వ ఉందని చెప్పారు. రైతుల వినియోగించుకోవాలని అన్నారు.