జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నెల్లిమర్ల పట్టణం పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి తదితరాల ఆచూకీ కోసం చర్యల్లో భాగంగా నెల్లిమర్ల ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. నెల్లిమర్ల పట్టణంతోపాటు పరిసరాల్లోని డైట్ కాలనీ రైల్వే ట్రాక్ బాలికల వసతి గృహాలు, సీకేఎం కాలేజీ, నిమ్స్ హాస్పిటల్, పరిసర ప్రాంతాలు పూడమ్మ గుడి రోడ్డు మీదుగా డ్రోన్ కెమెరాతో నిఘా ను ఏర్పాటు చేయడం జరిగిందని నెల్లిమర్ల ఎస్సై గణేష్ తెలిపారు.