బాపట్ల జిల్లా రేపల్లె తహసిల్దార్ మోర్ల శ్రీనివాసరావు గురువారం పెనుమూడి గ్రామంలోని పల్లిపాలెం, తీరప్రాంత ప్రజలను కృష్ణా నదిలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా నదికి నీటిని విడుదల చేసినందున, వరద నీరు పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నామని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.