ఇటీవల కురిసిన భారీ వర్షలకు మంజీరా నది ఉదృతంగా ప్రవహించింది. ఈ మేరకు సాలూర మండలం మంజీర పరిహార ప్రాంతంలోని సోయా పంట నీట మునిగి పంటలు పాడయ్యాయి. ఈ సందర్భంగా బోధన్ MLA పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఖాజాపూర్ గ్రామంలో నీట మునిగి పాడైన సోయా పంటలను స్థానిక బోధన్ రూరల్ పోలీసు వాహనంలో వెళ్లి పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రస్తుతానికి దాదాపుగా హున్సా, ఖాజాపూర్, సాలూర గ్రామాలలో 280 ఎకరాల సొయా పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాధికారులు గుర్తించారు. రైతులు ఎవరు అధైర్యపడవద్దని పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తానన్నారు.