గుడివాడలో రైతులను బయటపెట్టి డోర్ వేసిన ఘటన స్తానిక గుడివాడ పట్టణ పరిసరాల్లో ఉన్న రైతులకు మన గ్రోమోర్ ద్వారా వ్యవసాయ శాఖ యూరియా అందిస్తున్న విషయం విదితమే. కానీ అక్కడ రైతులను బయట పెట్టి గ్రోమోర్ సిబ్బంది డోర్లు వేయడంతో బుధవారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర బస్తా యూరియా ఇచ్చేందుకు అనేక ఆంక్షలు విధిస్తున్నారని రైతులు చెప్తున్నారు. యూరియా కొరతతో నానా ఇబ్బందులు పడుతుంటే యూరియా సరఫరా చేసే గ్రోమోర్ దగ్గర ఇలా జరగడంతో ఆవేదన లోనవుతున్నారు.