గుడిహత్నూర్ మండల కేంద్రంలో పరిస్థితి అదుపులో ఉందని ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ వెల్లడించారు. ఆదివారం ఆయన గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. శనివారం రాత్రి బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనపై విచారణ కొనసాగుతుందన్నారు. బాలికకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, నిందితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు.