సంగారెడ్డి పట్టణంలోని సఖి శిశు గృహలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి సౌజన్య శుక్రవారం తనిఖీ చేశారు. జాతీయ రాష్ట్ర న్యాయవాదికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సఖి కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ పిల్లలకు అన్ని చట్టాలపై అవగాహన ఉండాలని అన్నారు. క్రమశిక్షణతో అందరూ ఉండాలని పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివి మంచి పేరు తేవాలి అన్నారు.