కంది మండలం చేర్యాల గేట్ వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో రెండు ఇండికా కార్లలో ప్రత్యేక క్యాబిన్లలో తరలిస్తున్న 122.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 49 లక్షలు ఉంటుందని అంచనా. ఇద్దరు డ్రైవర్లు అబ్దుల్ వాహబ్, ఉమాకాంత్ సబర్లను అరెస్ట్ చేశారు. గత ఆరు నెలల్లో సుమారు 80 గంజాయి కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.