జమ్మికుంట :పట్టణంలోని మన గ్రోమోర్ ఎరువుల కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బుధవారం ఉదయం నుండి లైన్లో నిలబడితే మధ్యాహ్నం యూరియా బస్తాలు ఇవ్వకుండా టోకెన్లు మాత్రమే ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పట్టణంలో మన గ్రూప్ మోర్ కేంద్రం వద్ద ప్రధాన రహదారి కావడంతో నిలబడకుండా దాని ముందు గుంపులుగా రైతులు ఉండడం వల్ల ఒకరినొకరు తోచుకుంటూ ఇబ్బందులు పడడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక్కొక్కరికి లోపలికి పంపి టోకెన్ లు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టారు సరిపడా యూరియా లేనందున రేపు యూరియాను అందిస్తామని అధికారులు చెప్పడంతో రైతుల టోకెన్లు తీసుకొని వెళ్లిపోయారు.