అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిమెంట్ పరిశ్రమ పై ఎట్టకేలకు కదలిక వచ్చింది. సీసీఐ పరిశ్రమ ఏర్పాటుకు కావలసిన అనేక వనరులు ఉండడంవల్ల పరిశ్రమను తిరిగి పునరుద్ధరించవచ్చనే అంశంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, సీసీఐ సిఎండీ సంజయ్ బంగా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, సీనియర్ అధికారులతో కలిసి సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ పై చర్చించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లో సీసీఐ పరిశ్రమ ఏర్పాటు ఆవశ్యకత, ఉపాధి, తదితర విషయాలను మంత్రితో పాటు పరిశ్రమల శాఖకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులకు వివరించారు