లింగంపేట మండలం రైతువేదికలో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి హాస్టల్ అడ్వైసరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని మంగళవారం సూచించారు. హాస్టల్ వార్డెన్లు సమన్వయంతో పనిచేసి, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. వసతి గృహాల అభివృద్ధికి అవసరమైన నిధులను తీసుకురావడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు నూతన యూనిఫామ్ లను పంపిణీ చేశారు.