కనిగిరి పట్టణంలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండడంతో మంగళవారం వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కార్యక్రమానికి హాజరైన జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్మన్ వెంకాయమ్మ, వైసిపి ఇన్చార్జి నారాయణ యాదవ్ తో పోలీసులు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. 30 మందికి ఆర్డీవోను కలిసేందుకు అనుమతి ఇవ్వడంతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకులు ఆర్డీవోకు వినతి పత్రాన్ని సమర్పించారు.