అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు.. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లి మండలంలోని ఆయిల్ మిల్ సమీపంలో గల టర్నింగ్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుంచి కోరుట్లవైపు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. పొదల్లో కారు దూసుకుపోవడంతో కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.