తాంసి మండలంలోని జామిడి, కప్పర్ల మార్గంలో రహదారికి ఇరువైపుల ఉన్న వృక్షాలు బాటసారులకు ఎండాకాలం నీడనిస్తున్నాయి. కాగా తుమ్మ చెట్టు కలపకు భారీగా డిమాండ్ ఉండటంతో కొందరు వ్యాపారులు విచక్షణ రహితంగా చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్థులు వాపోతున్నారు.హోటళ్లకు, ఇటుక బట్టీలకు ఇతర అవసరాలకు వాటిని తరలిస్తున్నారని, అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.