పలమనేరు: పట్టణం మార్కెట్ యార్డు నందు శ్రీవారి సేవకుడు కాపల్లి రవీంద్రారెడ్డి తెలిపిన సమాచారం మేరకు. పూతలపట్టు నియోజకవర్గం లో ఉన్నటువంటి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి 2025 బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించుకునేందుకు మార్కెట్ యార్డ్ నందు మోహన్ రెడ్డి అని వ్యాపారి ముందుకు వచ్చి సుమారు 4 టన్నుల కూరగాయలను వితరణ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఆలయం వారు 12 వాహనాల కూరగాయలను అడిగి ఉన్నారు. వివిధ మార్కెట్లనుంచి కూడా ఉచితంగా అవి సరఫరా చేస్తామని ఆయన తెలిపారు.