ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నేటితో 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో ధర్మవరం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిటాల శ్రీరామ్ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. నిత్య నూతన విధానాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నారా చంద్రబాబునాయుడు జీవితం యువతకు ఆదర్శం అన్నారు.