28వ సిపిఐ రాష్ట్ర మహాసభలకు ఒంగోలు వేదికయింది.ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,పార్టీ జాతీయ నాయకుడు నారాయణ తదితర సీనియర్ నేతలంతా తరలివచ్చారు.ఈ సందర్భంగా శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఒంగోలు పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది.సిపిఐ శ్రేణులు ఎర్రజెండాలతో కదం తొక్కాయి.తదుపరి జరిగిన బహిరంగ సభలో సిపిఐ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా తీరుపై విరుచుకుపడ్డారు. ఇవే పోకడలు కొనసాగితే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు