ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొమ్మిలింగం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు దాసరి చిన్న ఎర్రన్నపై ప్రత్యర్థి నాయకుల దాడిని టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధారు నాయక్ తీవ్రంగా ఖండించారు. గుంటూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడిని గురువారం ఆయన పరామర్శించి మాట్లాడారు. టీడీపీకి ఓటు వేశారన్న కారణంతోనే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎర్రన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ధారు నాయక్ పేర్కొన్నారు.