గుంటూరు జిల్లా మంగళగిరి ఆత్మకూరు బైపాస్ రోడ్డులోని నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం నియోజకవర్గ ఇన్చార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు అన్నదాత పోరు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 9న మంగళగిరి నియోజకవర్గ రైతులు తెనాలి రామలింగేశ్వరపేటలోని ఏ 1 కన్వెన్షన్ హల్ నుండి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయం చేరుకుని వినతిపత్రం అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వేమిరెడ్డి కోరారు.