అదృశ్యమైన వ్యక్తి శవమై లభ్యమైన సంఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో చోటుచేసుకుంది. తాడ్వాయికి చేసిన సంతోష్ అనే వ్యక్తి వేల్పూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి వద్ద వ్యవసాయ కూలిగా పనిచేస్తున్నాడు. గత నెల 19వ తేదీన అదృశ్యమైన సంతోష్ మంగళవారం మండలంలో శవమై కనిపించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వేల్పూర్ ఎస్సై సంజీవి తెలిపారు. మృతదేహాన్ని పంచనామ నిమిత్తం మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామన్నారు.