రైతులకు అవసరమైన మేరకు ప్రభుత్వం వెంటనే యూరియాను సఫరా చేయాలని యూరియా కొరతను నివారించాలని కోరుతూ శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హిందూపురం సిపిఐ కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. అధికారంలోకి రాక ముందు రైతే రాజు, రైతు లేనిదే రాజ్యము లేదని గొప్పగా ప్రగల్బాలు పలికారని, అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు తుంగలో తొక్కరన్నారు. ప్రభుత్వ విధానాలతో రైతులు ప్రతియేటా అప్పుల ఊబిలో కూరుకుపోయి కోలుకోలేని స్థితి