పూతలపట్టు మండలం మెట్టూరు సమీపంలోని తిరుమల డైరీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుండి తిరుపతి వైపు వెళ్తున్న కారు అతివేగంగా దూసుకెళ్లి డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఢీకొట్టిన తీవ్రతకు కారు గ్లాస్ బద్దలైపోగా, ఒకరు కిందపడటంతో, మరొకరు స్టీరింగ్‌కు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.