బైరెడ్డిపల్లి: పోలీస్ స్టేషన్ వద్ద పాతూరి నత్తం గ్రామానికి చెందిన శ్రీనివాసులు శెట్టి తెలిపిన సమాచారం మేరకు. తన పెద్ద కుమారుడు ఉదయ్ కుమార్ గత 15 సంవత్సరాలుగా బెంగళూరు పట్టణంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కొనసాగుతూ భార్య ప్రియాంక పిల్లలతో జెపి నగర్ లో నివాసం ఉంటున్నారు. గత ఏడు నెలల క్రితం హఠాత్తుగా అదృశ్యమయ్యాడు జేపీ నగర్ పరిసర ప్రాంతాలలో, మిత్రులు బంధువులు కుటుంబీకులు ఉదయ్ కోసం తీవ్రంగా గాలించిన ఫలితం లేకుండా పోయింది. దీనిపై బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరికైనా తెలిస్తే పోలీస్ స్టేషన్, మా కుటుంబీకులు గాని సమాచారం ఇవ్వాలని కోరారు.