భీమ్ గల్ పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను సందర్శించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ పనుల పురోగతిని పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో నిరుద్యోగ యువతీ, యువకులకు ఆరు కోర్సులలో శిక్షణ ఇచ్చి 100% ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.లేటెస్ట్ టెక్నాలజీతో యంత్రాలపై అవగాహన కల్పిస్తూ ఈ కోర్సులను రూపొందించడం జరిగిందనీ చెప్పారు. 175 సీట్లకు గాను 100 మంది అప్లై చేసుకోగా, ఇంకా 75 మంది ఈ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉందని ఆయన తెలిపారు.