వరంగల్ జిల్లా వ్యాప్తంగా బొడ్డమ్మ తల్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో బొడ్డెమ్మ తొమ్మిది రోజుల కార్యక్రమం మహిళలకు ఎంతో ప్రత్యేకం. పుట్టమన్ను తో చేసే బొడ్డెమ్మ నేటి నుండి ప్రారంభం అయింది. రాయపర్తి మండలం మైలారం గ్రామంలో బొడ్డెమ్మ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. తొమ్మిది రోజుల పూజా కార్యక్రమాల అనంతరం బతుకమ్మ తొమ్మిది రోజుల పండుగ ప్రారంభం కానుంది.