మహానంది మండలం చెంచులక్షి గూడెం నందు ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఉదయాన్నే చెంచు లబ్ధిదారుల ఇళ్లవద్దకు వెళ్ళి ఎన్డీయే ప్రభుత్వం పెంచిన రూ.4000/- ల పెన్షన్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గూడెం మొత్తం కలియతిరిగి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.గృహాలు, పొలం సమస్యలు, త్రాగునీటి, అటవీ అధికారుల అభ్యంతరాలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చిన చెంచులువ్యసనాలను వీడి వ్యవసాయం, ఉపాధి అవకాశాల బాటపట్టిన చెంచులను అభినందించారు. ఎమ్మెల్యే బుడ్డా చెంచు యువకులతో కలిసి సరదాగా విల్లు విరిసి బాణం వేశారు.