అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం . కంటేవారి పల్లి వద్ద ఆదివారం పలమనేరూ నుంచి హార్స్లీ హిల్స్ కు వెళ్తున్న కారు అదుపుతప్పి మనోహర్ ఇంట్లో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం. రేకుల షెడ్డు దాదాపు రెండు లక్షల రూపాయల విలువచేసే మట్టి కుండలు ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. ఘటనపై కురబలకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.